PM Modi: తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ చిదిమేశాయి

PM Modi: తెలంగాణలో బీఆర్ఎస్ భారీ అవినీతికి పాల్పడింది

Jyothi
Published on: 17 March 2024 8:31 AM IST
PM Modi Comments On Congress, BRS
X

PM Modi: తెలంగాణ ప్రజల కలలను బీఆర్ఎస్, కాంగ్రెస్ చిదిమేశాయి

PM Modi: తెలంగాణలో గత పదేళ్లు అధికారంలోకి ఉన్న బీఆర్ఎస్ భారీ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు ప్రధాని మోడీ. బీఆర్ఎస్ అవినీతికి పాల్పడితే..తాజాగా తమ వంతు వచ్చిందని కాంగ్రెస్ భావిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. నాగర్ కర్నూల్ లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభ బీఆర్ఎస్ కాంగ్రెస్ లపై ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల కలలను పదేళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ చిదిమివేశాయన్నారు. తెలంగాణను నాశనం చేసేందుకు కాంగ్రెస్ కు ఐదేళ్లు చాలన్నారు ప్రధాని మోడీ.

Jyothi

Jyothi

Next Story