Piyush Goyal: కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించడం లేదు

Piyush Goyal: తెలంగాణలో బియ్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

Arun Chilukuri
Updated on: 20 July 2022 8:15 PM IST
Piyush Goyal Hits Out CM KCR Over Paddy Procurement
X

Piyush Goyal: కేంద్రానికి తెలంగాణ సర్కార్ సహకరించడం లేదు

Piyush Goyal: తెలంగాణలో బియ్యం సేకరణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొనుగోలు చేయాలని ఎఫ్‌సీఐని ఆదేశించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గరీబ్ కల్యాణ్ యోజన కింద ఆహార ధాన్యాలు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేయలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే పేదలకు బియ్యం అందలేదని వెల్లడించారు. తెలంగాణ రైస్ మిల్లుల్లో స్టాక్ నిల్వలు సరిగా లేవన్న పీయూష్ గోయల్ ఎన్నిసార్లు లేఖలు రాసిన మిల్లర్లపై తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకోలేదన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలు తప్ప ఏమీ పట్టించుకోవడం లేదని చెప్పారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రాజకీయ ఎజెండాతోనే కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం నిందలు వేస్తోందని విమర్శించారు. రాష్ట్ర సీఎం, మంత్రులు అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులపై టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలు బాధాకరమన్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒరిగేది లేదని, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story