నాగరాజు హత్య కేసులో కస్టడీ కోరుతూ ఎల్బీనగర్ కోర్టులో పిటిషన్

Hyderabad: హత్య సమయంలో ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు ఆరా

Rama Rao
Published on: 9 May 2022 12:23 PM IST
Petition Filed in LB Nagar Court Seeking Custody in Nagraj Murder Case
X

 నాగరాజు హత్య కేసులో కస్టడీ కోరుతూ ఎల్బీనగర్ కోర్టులో పిటిషన్ 

Hyderabad: హైదరాబాద్ సరూర్‌నగర్ పరువు హత్య కేసుకు సంబంధించి నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు ఎల్బీ నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్య సమయంలో ఎంతమంది ఉన్నారనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు హత్య జరిగేటప్పుడు ఐదుగురు ఉన్నారని నాగరాజు భార్య ఆశ్రీన్ చెబుతోంది. ఇప్పటికే సంఘటన స్థలంలో ఇద్దరిని గుర్తించిన పోలీసులు మిగతా వారిపై ఫోకస్ పెట్టారు. నాగరాజును గుర్తించేందుకు నిందితులు మొబైల్ ట్రాకర్ యాప్‌ను ఎలా ఇన్‌స్టాల్ చేశారనే దానిపై కూడా అరా తీస్తున్నారు. ప్రధాన నిందితుడు మోబిన్ స్నేహితుల వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇక నిందితులను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story