ఏరియా హాస్పిటల్స్ ను జిల్లా హాస్పిటల్స్ గా అప్ గ్రేడషన్ కు అనుమతులు

ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్ గ్రేడేషన్ చేసేందుకు అవసరమైన అనుమతి ఇవ్వడంతోపాటు...

S. Srikanth
Published on: 23 Nov 2019 11:25 AM IST
ఏరియా హాస్పిటల్స్ ను జిల్లా హాస్పిటల్స్ గా అప్ గ్రేడషన్ కు అనుమతులు
X
Errabelli Dayakar Rao

మహబూబాబాద్ : వరంగల్, మహాబాబాబాద్, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు ఏరియా ఆస్పత్రులను జిల్లా ఆస్పత్రులుగా అప్ గ్రేడేషన్ చేసేందుకు అవసరమైన అనుమతి ఇవ్వడంతోపాటు, ఒక్కో ఆస్పత్రికి దాదాపు రూ.60 కోట్ల చొప్పున విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా తరుపున పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

ఆస్పత్రుల ఉన్నతీకరణలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కి సైతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాను హెల్త్ హబ్ గా మార్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story