తెలంగాణలో తమ కార్యకలాపాలను రెట్టింపు చేస్తామన్న పెప్సికో సంస్థ

PepsiCo Business Expansion in Telangana
x

తెలంగాణలో తమ కార్యకలాపాలను రెట్టింపు చేస్తామన్న పెప్సికో సంస్థ

Highlights

*పెప్సికో తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం

KTR: తెలంగాణలో తమ కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ పెప్సికో ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో పెప్సికో సంస్థ ప్రతినిధులు ఈ విషయాన్ని ఎనౌన్స్ చేశారు. కేవలం 250 మందితో 2019లో ప్రారంభమైన గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్లో 2వేల800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్న పెప్సికో.. ఈ సంఖ్యను 4వేలకు పెంచబోతున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో కార్యకలాపాలను రెట్టింపు చేసేందుకు పెప్సీకో తీసుకున్న నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఎంతో పేరున్న పెప్సీకో విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ సహకారాలను తమ ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడి అనుకూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని.. ఇతర విభాగాలు, రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని పెప్సికో ప్రతినిధి బృందానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories