అధ్వానంగా హైదరాబాద్ బస్ షెలర్ట్‌లు

అధ్వానంగా హైదరాబాద్ బస్ షెలర్ట్‌లు
x
Hyderabad Bus Stops (File Photo)
Highlights

సిటీలో ఆర్టీసీ ప్రయాణికులకు నిలువ నీడ కరువవుతోంది. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ రోడ్లపైనే బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. చాలా బస్టాప్‌లలో షెల్టర్లే లేవు.

సిటీలో ఆర్టీసీ ప్రయాణికులకు నిలువ నీడ కరువవుతోంది. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ రోడ్లపైనే బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. చాలా బస్టాప్‌లలో షెల్టర్లే లేవు. ఉన్నచోట నిర్వహణ అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి. బస్టాప్ ల నిర్వహణ కోసం లీజుకు తీసుకున్న కంపెనీలు ఏం చేస్తున్నాయి...ప్రయాణికులు ఏమంటున్నారు వాచ్ దిస్ స్టోరి

హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు ఎప్పుడు వస్తాయో తెలియదు. తమ రూట్ బస్ వచ్చేదాక బస్ షెల్టర్ లో వేచివుందామంటే చికాకు కలిగిస్తోంది. కూర్చోద్దాం అంటే కుర్చీలు విరిగి వుంటాయి. నిలిచి వుద్దామంటే అపరిశుభ్రత వాతావరణం నిలబడనీయదు.

హైదరాబాద్ లోని దాదాపు 800 బస్ షెల్టర్ల నిర్వహణను అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లకు ఇచ్చారు. బస్ షెల్టర్ ను యాడ్స్ కోసం వాడుకుంటూ కుర్చీలు ఏర్పాటు చేయాలి, క్లీన్ నెస్ మెయిన్ టెన్స్ చేయాలి. బస్ షెల్టర్స్ ను యాడ్స్ కోసం వాడుకుంటున్న యాడ్ ఏజెన్సీలు సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న బస్ షెల్టర్ల పరిస్థితి పై HMTV గ్రౌండ్ సర్వే నిర్వయించింది. అధిక బస్ షెల్టర్లు అధ్వాన స్థితిలో వున్నాయి. నామ్ కే వస్తే అన్నట్లు కొన్ని ప్రధాన ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్ లు వున్నాయి.

పీసీబీ కార్యాలయం వద్దనున్న బస్‌షెల్టర్‌ లో చాలా కాలంగా ఎవరో వ్యక్తులు నివాసం ఉంటున్నారు. సామాన్లతో నింపేసి జీవనం సాగిస్తున్నారు. ప్రయాణికులు మాత్రం బయట ఎండలో నిల్చుంటున్నారు. బస్ షెల్టర్లలో దుస్థితి గురించి అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో వేసవికాలం రానుంది. ఎండల తీవ్రత నుంచి తలదాచుకునేందుకు బస్ షెల్టర్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని భాగ్యనగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories