Burgampahad: కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపిపి, జెడ్పిటిసి సూచన

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మన పక్క మండలం లో అయిన అశ్వాపురం మండలం లో నమోదు కావడం దురదృష్టకరమని ఎంపిపి, జెడ్పిటిసి అన్నారు.

S. Srikanth
Updated on: 15 March 2020 7:15 PM IST
Burgampahad: కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపిపి, జెడ్పిటిసి సూచన
X

బూర్గంపహాడ్: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మన పక్క మండలం లో అయిన అశ్వాపురం మండలం లో నమోదు కావడం దురదృష్టకరమని ఎంపిపి, జెడ్పిటిసి అన్నారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆదేశాలతో ఈరోజు మోరంపల్లి బంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీపీ కైపు రోసిరెడ్డి, జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో సిబ్బందికి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీ మాట్లాడుతూ... కరోనా వైరస్ పై వచ్చే వదంతులను ప్రజలు నమ్మవద్దని, అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ముందస్తు సెలవు ప్రకటించడం జరిగిందని.. దీన్ని ప్రైవేటు స్కూల్ యాజమాన్యం అందరు పాటించాలని ఆమె సూచించారు.

ముఖ్యంగా ప్రజలు ఎక్కువసార్లు సబ్బుతో చేతులు కడుక్కోవాలని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఎవరికి సెకండ్లు ఇవ్వద్దని అందరూ నమస్కారం చేసుకోవాలని, ఎవరికైనా అదేవిధంగా జలుబు, జ్వరం వస్తుంటే దగ్గరలోనే ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించుకోవాలనే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోరంపల్లి బంజర్ సర్పంచ్ భూక్య దివ్యశ్రీ, ఎంపీటీసీ, వెంకటేశ్వర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story