నీ పేరు రాసి చస్తాం: ఎమ్మెల్యేపై మహిళల ఆగ్రహం

నీ పేరు రాసి చస్తాం: ఎమ్మెల్యేపై మహిళల ఆగ్రహం
x
Highlights

వరద పరిస్థితులను సమీక్షిందేకు వెళ్లిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి చుక్కెదురైంది. నిన్నటి నుండి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని మీరు ఇప్పుడు...

వరద పరిస్థితులను సమీక్షిందేకు వెళ్లిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి చుక్కెదురైంది. నిన్నటి నుండి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారంటూ స్థానికులు నిదీశారు. తిండి, తిప్పలు లేకుండా అల్లడిపోతున్నా పట్టించుకున్న వారే లేరని వాపోయారు. వరదల్లో ఇలాగే చిక్కుకుని చావాలా? అని ప్రశ్నించారు. నీటిలో చిక్కుకుని చనిపోయేటట్లయితే 'నీ పేరు రాసి చస్తాం!' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రకృతి వైపరీత్యానికి ఎవరూ ఏం చేయలేరన్న ఎమ్మెల్యే కామెంట్స్ మరింత హీట్ పుట్టించాయి. దీంతో స్థానిక మహిళలు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కూడా ఎమ్మెల్యేకే వంత పాడారు. మహిళలు ప్రశ్నిస్తుండగానే ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు.


Show Full Article
Print Article
Next Story
More Stories