పీసీసీ కోర్‌ కమిటీ కీలక నిర్ణయాలు.. జీహెచ్‌ఎంసీలో పోటీకి దరఖాస్తుతో పాటు డిపాజిట్

పీసీసీ కోర్‌ కమిటీ కీలక నిర్ణయాలు.. జీహెచ్‌ఎంసీలో పోటీకి దరఖాస్తుతో పాటు డిపాజిట్
x
Highlights

గ్రేటర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికెట్ దరఖాస్తు చేసుకోవాలంటే పదివేల రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్‌ కొత్త షరతు పెట్టింది. టిక్కెట్టు కోసం ప్రయత్నం...

గ్రేటర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికెట్ దరఖాస్తు చేసుకోవాలంటే పదివేల రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్‌ కొత్త షరతు పెట్టింది. టిక్కెట్టు కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సీరియస్‌గా ఉన్నారా లేదా అని తేల్చుకోవడానికి పార్టీ పేరు మీద చెక్కు ఇవ్వాలని కాంగ్రెస్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. కోర్ కమిటీలో తీర్మానించింది. మొదటి సారి GHMC ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి నుండి డిపాజిట్ వసూలు చేయాలని కోర్ కమిటీ నిర్ణయించింది. గ్రేటర్ ఎన్నికల్లో బీసీలకు యాబై శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది కోర్ కమిటీ.

పీసీసీ కోర్‌ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పాటు న్యాయపరంగా కూడా బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించింది. గ్రేటర్‌లో బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రతిపాదించారు. దీనికి జానారెడ్డి, చిన్నారెడ్డిలు మద్దతు పలికారు. రెడ్డిలు అయినా బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలని ప్రతిపాదించిన జీవన్‌రెడ్డి, జనారెడ్డిలకు అభినందనలు తెలిపారు వీహెచ్.

తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల7న మహిళలు దళితులపై దాడులకు నిరసనగా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇక కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఈ నెల 11న ఖమ్మంలో ట్రాక్టర్లతో రైతు ర్యాలీ నిర్వహించనుంది. రాష్ట్రంలో వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా ఈ నెల12న జిల్లా కేంద్రాల్లో రైతు కోసం దీక్ష చేపట్టబోతుంది.

గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ చేయాలనుకునే నాయకులు దరఖాస్తుతో పాటు డిపాజిట్ కూడా చేయాలని కోర్ కమిటీ నిర్ణయించింది. జనరల్ సీట్లలో పోటీ చేసే వారు పది వేలు డిపాజిట్ చేయాలని సూచించింది. రిజర్వేషన్ కోటాలో సీటు ఆశిస్తున్న వారు ఐదు వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ కూడా చెక్కులు రూపంలో పార్టీకి ఇవ్వాలని కోర్ కమిటీ నిర్ణయించింది. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వడంతో పాటు సన్నరకం వడ్లకు 2వేల 500 రూపాయల మద్ధతు ధర ఇవ్వాలని డిమాండ్‌ని ప్రభుత్వం ముందు ఉంచి ఆందోళన చేపట్టాలని కోర్ కమిటీ నిర్ణయించింది. ఇక రైతు సమస్యలపై ఉద్యమానికి శాశ్వత కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories