Revanth Reddy: గవర్నర్‌కు సరైన గౌరవం ఇవ్వడం లేదు.. ఖమ్మం సభలో కాంట్రాక్టు కంపెనీకి ప్రమోటర్‌గా కేసీఆర్ మాట్లాడారు..

Revanth Reddy: గవర్నర్ నిర్ణయాలు, ప్రొటోకాల్‌ను ఎవరైనా పాటించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 20 Jan 2023 3:54 PM IST
PCC Chief Revanth Reddy Chit Chat With Media
X

Revanth Reddy: గవర్నర్‌కు సరైన గౌరవం ఇవ్వడం లేదు.. ఖమ్మం సభలో కాంట్రాక్టు కంపెనీకి ప్రమోటర్‌గా కేసీఆర్ మాట్లాడారు..

Revanth Reddy: గవర్నర్ నిర్ణయాలు, ప్రొటోకాల్‌ను ఎవరైనా పాటించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డి అన్నారు. తెలంగాణ గవర్నర్‌కు సరైన గౌరవం ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డారు. జాతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా గవర్నర్లను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. విభజన చట్టం ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌పై గవర్నర్‌కు సర్వాధికారాలు ఉన్నాయని చెప్పారు. గతంలో ఉన్న గవర్నర్ ‌ను పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదని తెలిపారు. ఖమ్మం సభలో కాంట్రాక్టు కంపెనీకి ప్రమోటర్‌గా కేసీఆర్ మాట్లాడారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటల్లో ఐడియాలజీ లేదని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడిస్తాం అంటే అర్థం ఉంది... తెలంగాణలో లేని బీజేపీని ఓడిస్తాం అంటే ఏమనుకోవాలని అన్నారు. ఒక్క ఎంపీ లేని ఆమ్ఆద్మీ బీజేపీని ఓడిస్తుందా అని రేవంత్ ప్రశ్నించారు.

ఖమ్మం సభకు కేసీఆర్ మిత్రుడు ఎంఐఎంను ఎందుకు పిలవలేదని రేవంత్ ప్రశ్నించారు. పువ్వాడను గెలిపించింది కాంగ్రెస్సేనని అందుకే కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నాడని చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ చేసిన ఆఫర్ ను పువ్వాడ సమర్దించారని తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని సీఎల్పీ నేత భట్టి ఎప్పుడో ఆహ్వానించారని చెప్పారు. కేసీఆర్‌కు 500కోట్లు ఓ లెక్కనా..అని...దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులలో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. షర్మిల పార్టీని ఎన్జీవోగా చూస్తానని తెలిపారు. తెలంగాణతో, తెలంగాణ తల్లితో కేసీఆర్‌కు సంబంధం లేదన్నారు రేవంత్‌రెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story