Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు స్వల్ప అస్వస్థత

Pawan Kalyan
X

Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో ఆయన బాధపడుతున్నారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురవారం తన నివాసంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్య పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story