పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం

పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
x
Highlights

మండలంలోని కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి)లో శుక్రవారం పంచామృత అభిషేక నిర్వహించారు.

పాల్వంచ: మండలంలోని కేశవాపురం-జగన్నాధపురం గ్రామంలో వెలసియున్న శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి)లో శుక్రవారం పంచామృత అభిషేక నిర్వహించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ దంపతులు, అర్చకులు, భక్తులు అమ్మవారి మూలవిరాట్ కు వంచామృతాలతో అభిషేకం, వంచహారతులు, నివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్.శ్రీనివాస్ దంపతులు, వేద పారాయణ దారు శ్రీ పద్మనాభశర్మ, అర్చకులుశ్రీ పురాణం పురుషోత్తమశాస్త్రి, రవికుమార్ శర్మ, దుర్గాప్రసాద్ శర్మ, నర్సింహమూర్తి, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories