Palla Rajeshwar Reddy: రైతులకు కేసీఆర్ ఆనందం ఇస్తే... కాంగ్రెస్ ఆందోళన మిగిల్చింది

Palla Rajeshwar Reddy: ఆంక్షల పేరుతో రుణమాఫీని కొందరికే పరిమితం చేశారు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 19 July 2024 10:30 PM IST
Palla Rajeshwar Reddy Comments On Congress Government
X

Palla Rajeshwar Reddy: రైతులకు కేసీఆర్ ఆనందం ఇస్తే... కాంగ్రెస్ ఆందోళన మిగిల్చింది

Palla Rajeshwar Reddy: రైతులకు కేసీఆర్‌ ఆనందాన్నిస్తే.. కాంగ్రెస్‌ ఆందోళన మిగిల్చిందని BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని విమర్శించారు. ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నా హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ కోసం 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారన్నారు. రైతులకు కాంగ్రెస్‌ చేసింది గోరంత అయితే.. కొండంతలుగా గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంక్షల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల రుణమాఫీని కొందరికే పరిమితం చేసిందని విమర్శించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story