ఓటరు జాబితాను సరిచేయండి: జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి

ఓటరు జాబితాను సరిచేయండి: జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి
x
జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, పడకంటి రమాదేవి, ఆడెపు సుధాకర్
Highlights

జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావును కలవడం జరిగింది.

నిర్మల్: జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావును కలవడం జరిగింది. మున్సిపాలిటీలో జరిగిన అవకతవకలపై, వార్డుల విభజన లోపాలు, ఒకే కుటుంబానికి సంబంధించిన ఓట్లను వివిధ వార్డుల్లో వేయడంపై , బౌండరీలు సరిహద్దులు సరి చేయమని, వార్డు విభజనలో డబుల్ ఓట్లు ఉండడం వల్ల ఓట్ల సంఖ్య పెరుగుతున్నదని, కావున వాటిని సవరణ చేయాలని కోరారు.

వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విత్తన పాలక మండలి సభ్యులు అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, భైంసా పట్టణ అధ్యక్షులు బాలాజీ సూత్రాలే , నాయకులు రఘువీర్, రాజేశ్వర్, నందు బయ్యా, మల్లేష్, అనిల్, భూషణ్, శ్రీనివాస్, హరీష్, ఆనంద్రావు, రాజీ తదితరులు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories