ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ, పీజీ పరీక్షా ఫలితాలు విడుదల

ఎప్పుడెప్పుడా అని విద్యార్థులు ఎదురు చూస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి.

Sumitra
Published on: 25 April 2020 3:53 PM IST
ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ, పీజీ పరీక్షా ఫలితాలు విడుదల
X
Osmania University

ఎప్పుడెప్పుడా అని విద్యార్థులు ఎదురు చూస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి.ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పీజీ కోర్సుల్లో మొదటి, మూడో, అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలలను విడుదల చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

డిగ్రీ కోర్సుల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ ఇతర కోర్సుల్లో మొదటి, మూడో, అయిదో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షల రివాల్యుయేషన్‌ ఫలితాలు విడుదల చేశామని తెలిపారు. అదే విధంగా పీజీలో ఫిలాసఫీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఆర్కియాలజీ, ఉర్దూ, పర్షియన్‌, మరాఠీ, హిస్టరీ, ఇంగ్లిష్‌ విభాగాల్లో ఎంఏ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌, ఎం.కాం మొదటి సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు విడుదల చేశామని ఆయన తెలిపారు. ఫలితాలను ఓయూ అధికారిక వెబ్ సైట్ www.osmania.ac. inలో ఉంచినట్లు ఆయన వెల్లడిచేసారు. ఫలితాలు చూసుకోవానుకునే విద్యార్థులు వెబ్ సైట్ ద్వారా పొందవచ్చిన స్పష్టం చేసారు.

Sumitra

Sumitra

Next Story