logo
తెలంగాణ

Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రిలో దారుణం..బతికున్న మహిళ చనిపోయిందంటూ సమాచారం..

Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రిలో దారుణం..బతికున్న మహిళ చనిపోయిందంటూ సమాచారం..
X
Highlights

బతికున్న మహిళను చనిపోయిందంటూ ఆమె కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం ఇచ్చిన సంఘటన హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

బతికున్న మహిళను చనిపోయిందంటూ ఆమె కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం ఇచ్చిన సంఘటన హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. గత కొంత కాలంలో నగరంలొని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరుగుతున్న శవపంచాయతీలలు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్న సమయంలో ఇదో కొత్త తరహా కేసు బయటికి పొక్కింది. ఈ సంఘటనకు సంబందించి పూర్తివివరాల్లోకెళితే కొద్దిరోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రిలో ఒకే వయసులో ఉన్న ఇద్దరు మహిళలు చికిత్స నిమిత్తం చేరారు.

ఆ ఇద్దరు మహిళల్లో ఒక మహిళ శ్వాస సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతుండగా మరో మహిళ కరోనాతో పోరాడుతుంది. కాగా ఆ ఇద్దరిలో కరోనాసోకిన మహిళ మృతి చెందింది. దీంతో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంధి శ్వాస ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిన మహిళ చనిపోయిందని ఆమె కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీసారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నతన తల్లి ఎలా చనిపోయిందని బాధితురాలి కూతరు నిలదీసింది. తన తల్లి చనిపోలేదని, వేరే మహిళ చనిపోయిందని తెలుసుకున్న వారు తప్పుడు సమాచారం ఇచ్చి భయభ్రాంతులకు గురిచేశారని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


Web TitleOsmania Hospital doctors negligence informed wrongly as woman demise in Hyderabad Telangana
Next Story