గాంధీ హాస్పిటల్ లో మరోసారి బయటపడ్డ సిబ్బంది నిర్లక్ష్యం....

గాంధీ హాస్పిటల్ లో మరోసారి బయటపడ్డ సిబ్బంది నిర్లక్ష్యం....
x
Highlights

గాంధీ ఆస్పత్రి వైద్యల నిర్లక్ష్యం మరో సారి బయట పడింది. గత నెల 29వ తేదీన ఓ వ్యక్తిని కరోన లక్షణాల తో ఉస్మానియా హాస్పిటల్ నుండి , మే 30 న కింగ్ కోటి హాస్పిటల్ కి తీసుకెళ్లారు.

గాంధీ ఆస్పత్రి వైద్యల నిర్లక్ష్యం మరో సారి బయట పడింది. గత నెల 29వ తేదీన ఓ వ్యక్తిని కరోన లక్షణాల తో ఉస్మానియా హాస్పిటల్ నుండి , మే 30 న కింగ్ కోటి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడ పాజిటివ్ రావడంతో అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కాగా మే 31 వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడిన కరోనా బాధితుడు, 1 వ తేదీన గాంధీ హాస్పిటల్ నుండి మిస్సయ్యాడు. దీంతో బాధితుని కోసం గాంధీ హాస్పిటల్ సిబ్బందిని కుటుంబ సభ్యులు సంప్రదించగా తమకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు. అతడి జాడ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు జూన్ 6న మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న మంగళ హాట్ పోలీసులు మిస్సింగ్ పై విచారణ చేపట్టారు. కాగా అనూహ్యరీతిలో శనివారం బాధితుని మృతదేహం గాంధీ మార్చురీలో లభ్యమైంది. దీంతో హాస్పిటల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా బాధితుని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు 20 రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ అధికారులు సమాధానం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. గాంధీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతడు చనిపోయాడని ఆరోపిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు బాధితుని మిస్సింగ్ మృతి పై సీఐడీ ఎంక్వరీ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పోలీసులు విచారించగా సదరు పేషెంట్ పేరు గాంధీ హాస్పిటల్‌ ఔట్ పేషెంట్ లిస్టులో మాత్రమే కనిపించింది. అడ్మిట్ చేసుకున్న వివరాలు లభ్యం కాలేదు. కానీ ఇప్పుడు డెడ్ బాడీని మార్చురీలో గుర్తించడం గమనార్హం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories