తెలంగాణ మరో ఇటలీ అవుతుంది: ఓ వైద్యురాలి ఆవేదన

తెలంగాణ మరో ఇటలీ అవుతుంది: ఓ వైద్యురాలి ఆవేదన
x
గాంధీ ఆస్పత్రి ఫైల్ ఫోటో
Highlights

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ గత మూడు, నాలుగు నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపిస్తూ ప్రజలందరినీ వణికిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో...

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా వైరస్ గత మూడు, నాలుగు నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాపిస్తూ ప్రజలందరినీ వణికిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల మందికి వ్యాపించి వారిని బలితీసుకుంటుంది. ఇక ఇదే నేపథ్యంలో తెలంగాణలోనూ వైరస్ కేసులు అంచెలంచెలుగా పెరిగిపోతున్నాయి. దీంతో గత మూడు నెలలుగా గాంధీ హాస్పిటల్‌లో పని చేసే వైద్యులు కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయాలను వ్యక్తం చేస్తూ ఓ గాంధీ వైద్యురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాక గాంధీ డాక్టర్లపై పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వానికి కొన్ని సూచించారు. ఒకప్పుడు గాంధీలో మెడికల్ కాలేజీలో సీటు వస్తే గ్రేట్‌గా ఫీలవుతారు. కానీ రాబోయే తరంలో గాంధీలో మెడికల్ సీటు వద్దనే పరిస్థితి దాపురిస్తోంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. గాంధీ ఆస్పత్రిలో మాత్రమే ఎందుకు కరోనా పేషెంట్లకు చికిత్స అందించాలి ? ఆరోగ్య శ్రీతో ప్రయివేట్ హాస్పిటళ్లలోనూ కరోనా చికిత్స అందించొచ్చు కదా అని ఆమె ప్రశ్నించారు. ఈ పథకాన్ని అమలు చేస్తే గాంధీ హాస్పిటళ్లలో పని చేసే వైద్యులపై పని భారం తగ్గుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

గత 3 నెలలుగా తెలంగాణలో నమోదవుతున్న కేసులతో గాంధీ వైద్యుల నిర్విరామంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజలకోసం ఇంతగా శ్రమిస్తున్న వైద్యుల పరిస్థితి ఏంటి..? వాళ్లు పీజీ స్టూడెంట్లు, ఎక్కడికీ పారిపోరనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా చేస్తోందా? గాంధీలో డాక్టర్లు పడే మనో వేదనను అర్థం చేసుకోవాలి అని ప్రశ్నించారు. గాంధీ నుంచి డాక్టర్లను షిఫ్ట్ చేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వం ప్రజలెవరూ బయటికి రాకుండా ఉండాలని లాక్ డౌన్ విధించినప్పటికీ ఆ 40 రోజులు జనం ఇండ్లలో ఉండలేక బయటకు వస్తున్నారని అంటున్నారు. కరోనా టెస్టులు పెంచాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆమె తెలిపారు. డాక్టర్ల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని ఆమె ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ మరో ఇటలీ అవుతుందనడంలో సందేహం లేదని హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories