Harish Rao: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడుల పేరుతో వేధిస్తున్నారు

Harish Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు-

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 Jun 2024 8:55 PM IST
Opposition MLAs are being harassed in the name of ED and IT attacks Says Harish Rao
X

Harish Rao: ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడుల పేరుతో వేధిస్తున్నారు

Harish Rao: అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తెలంగాణలోని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఈడీ, ఐటీ దాడుల పేరుతో వేధిస్తున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో దర్యాప్తు సంస్థల సోదాలను ఆయన ఖండించారు. ఈడీ, ఐటీ దాడులతో అధికారపార్టీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బిహార్, గుజరాత్ లో పరీక్షా ప్రశ్నాపత్రాలు లీకవుతున్నా అధికారులు ఎందుకు వారిపై దాడులు చేయటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తు అయోమంలో ఉందన్నారు హరీశ్ రావు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story