Intermediate Online Classes Postponed in Telangana: ఆన్ లైన్ క్లాసులు వాయిదా..

Intermediate Online Classes Postponed in Telangana: తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియట్ ఆన్ లైన్ క్లాసులు వాయిదా ప‌డ్డాయి. రాష్ట్రంలో నేటి నుంచి దూరదర్శన్, టీ-శాట్ ఛానళ్లలో ఇంటర్మీడియట్ డిజిటల్ క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది

Karampoori Rajesh
Updated on: 17 Aug 2020 8:28 AM IST
Intermediate Online Classes Postponed in Telangana: ఆన్ లైన్ క్లాసులు వాయిదా..
X

Intermediate Online Classes Postponed in Telangana: తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియట్ ఆన్ లైన్ క్లాసులు వాయిదా ప‌డ్డాయి. రాష్ట్రంలో నేటి నుంచి దూరదర్శన్, టీ-శాట్ ఛానళ్లలో ఇంటర్మీడియట్ డిజిటల్ క్లాసులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డిజిటల్ తరగతుల నిర్వహణను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. త్వరలోనే డిజిటల్ తరగతులు ప్రారంభించే కొత్త తేదీలను ప్రకటిస్తామని ఇంటర్మీడియట్ సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

కాగా, ఆగష్టు 17వ తేదీ నుంచి ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్, డిజిటల్ క్లాసులు, అలాగే ఈ నెల 20 నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు.. సెప్టెంబర్ 1 నుంచి 3-5 తరగతులకు డిజిటల్ తరగతులు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story