గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి:ఒకరి మృతి

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా లో అపశ్రుతి చోటు చేసుకుంది. నిమ్మజ్జనం సమయంలో ప్రమాదవసట్టు నీటిలో దిన ఒక వ్యక్తీ మృతి చెందారు.

K V D Varma
Published on: 12 Sept 2019 11:07 AM IST
గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి:ఒకరి మృతి
X

వైరా:ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జన సమయంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తీ మృత్యువాత పడ్డాడు. తనికెళ్ల గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. ముగింపు ఉత్సవాల సందర్భంగా గురువారం కెనాల్ నందు నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి తనికెళ్ళ గ్రామానికి చెందిన భూక్య నాగ (35) అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు కాలువలోకి దూకి చనిపోయిన వ్యక్తిని బయటకు తీశారు. సంఘటన విషయమై స్థానిక పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. గణేష్ నిమజ్జనంలో అపశృతి జరగడంతో గ్రామంలోని ప్రజలు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

K V D Varma

K V D Varma

Next Story