Gaddar Last Rites: గద్దర్ అంతిమ యాత్రలో విషాదం.. తొక్కిసలాటలో ఒకరు మృతి..

Gaddar Last Rites: గద్దర్ అంతిమ యాత్రలో విషాదం.. తొక్కిసలాటలో ఒకరు మృతి..

Arun Chilukuri
Updated on: 7 Aug 2023 7:26 PM IST
One Died in Stampede at Gaddar Last Rites
X

Gaddar Last Rites: గద్దర్ అంతిమ యాత్రలో విషాదం.. తొక్కిసలాటలో ఒకరు మృతి..

Gaddar Last Rites: ప్రజాగాయకుడు గద్దర్ అంతిమ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. గద్దర్ నివాసం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి లక్డికపూల్‌కు చెందిన అభిమానిగా గుర్తించారు. తొక్కిసలాట జరిగిన అనంతరం బాధితుడిని కొందరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆసుపత్రి చేరుకునేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన ఓ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ గా తెలుస్తోంది. గద్దర్ పార్థివ దేహాన్ని ఆయన ఇంటి నుంచి మహాబోధి స్కూల్ ఆవరణకు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story