దేశవ్యాప్తంగా రెండోరోజు పెరిగిన చమురు ధరలు

Petrol and Diesel Prices: లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంపు

Rama Rao
Updated on: 23 March 2022 11:01 AM IST
Oil Prices Rise for the Second Day in Country | Telugu Online News
X

దేశవ్యాప్తంగా రెండోరోజు పెరిగిన చమురు ధరలు

Petrol and Diesel Prices: దేశవ్యాప్తంగా వరుసగా రెండోరోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరగగా హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ 110 రూపాయలు, డీజిల్‌ 96 రూపాయల 36 పైసలుగా ఉంది. ఇక ఏపీలో లీటరు పెట్రోల్‌ 111 రూపాయల 23 పైసలు ఉండగా డీజిల్‌ 97 రూపాయల 28 పైసలుగా ఉంది. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ 112 రూపాయల 8 పైసలు, డీజిల్‌ లీటరు 98 రూపాయల 10 పైసలుకు చేరింది.

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో ధరలపై వాహనాదారులు మండిపడుతున్నారు. నిత్యావసర వస్తువులతో సమానంగా పెట్రో రేట్లు పెంచడం శోచనీయమంటున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో పెట్రోల్ పోయించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. సరుకు రవాణాపై పెట్రో ధరల ప్రభావం పడుతుందని వాహనదారులు చెబుతున్నారు.

Rama Rao

Rama Rao

Next Story