ప్రభుత్వ ఆసుపత్రులలో రోజురోజుకీ పెరుగుతున్న డెలివరీల సంఖ్య.. 24 గంటలలోనే 31 డెలివరీలు.. హరీష్ రావు ట్వీట్

Harish Rao: ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగిస్తున్నారని అభినందన

Shekhar G
Updated on: 26 July 2023 12:40 PM IST
Number Of Deliveries Increasing Day By Day In Government Hospitals Says Harish Rao
X

ప్రభుత్వ ఆసుపత్రులలో రోజురోజుకీ పెరుగుతున్న డెలివరీల సంఖ్య.. 24 గంటలలోనే 31 డెలివరీలు.. హరీష్ రావు ట్వీట్

Harish Rao: ప్రభుత్వ ఆసుపత్రులలో రోజురోజుకీ మాత శిశు ఆరోగ్య కేంద్రాలలో డెలివరీల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ప్రసవం అవుతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలు అందుతున్నాయి. ఇందులో భాగంగా జనగామ జిల్లా కేంద్రం లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం లో వైద్యులు రికార్డు స్థాయిలో డెలివరీలు చేశారు. కేవలం 24 గంటలలోనే 31 డెలివరీలు చేసి వైద్యులు రికార్డును సృష్టించారు. ఇందులో 17 నార్మల్ డెలివరీలు కాగా 14 సిజేరియన్ డెలివరీలు అయ్యాయి. వైద్యుల పనితీరుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు మరింత నమ్మకం కలిగేవిధంగా అంకితభావం తో పనిచేస్తున్నారని వైద్యులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.


Shekhar G

Shekhar G

Next Story