అంతర రాష్ట్ర ప్రయాణాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదు : తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

అంతర రాష్ట్ర ప్రయాణాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Samba Siva Rao
Published on: 2 Jun 2020 7:30 PM IST
అంతర రాష్ట్ర ప్రయాణాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదు : తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
X
Telangana DGP Mahinder Reddy (file Photo)

అంతర రాష్ట్ర ప్రయాణాలకు ప్రత్యేక పాసులు అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అంతరాష్ట్ర ప్రయాణాలకు డీ.జీ.పీ కార్యాలయం నుంచి ప్రత్యేకంగా పాసులు జారీ చేసేది. ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఇక నుంచి డీజీపీ కార్యాలయంలో పాసులు తీసుకొవాల్సిన అవసరం లేదన్నారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంద్ర ప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్రకు ప్రయాణించే వారు మాత్రం తమ పేర్లను అక్కడి ప్రభుత్వాల యాప్ లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణాలకు ట్రాన్స్ పోర్ట్ పాసులను జారీ చెయడాన్ని పోలీసు శాఖ నిలిపి వేసింది.

తెలంగాణా కు వచ్హే వాహనాలకు కూడా వాహన పాసులను అడగడం లేదు. అయితే, ఆంద్రప్రదేశ్ కు వెళ్లాల్సిన వారు స్పందన యాప్ లో, కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేవారు ఆ రాస్ట్రానికి చెందిన సేవా యాప్ లోనూ, మహరాస్ట్రకు వెళ్లే వారు ఆ రాష్ట్ర పోర్టల్ లో ప్రయాణికుల వివరాలను నమోదు చెయాల్సి ఉంటుంది.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story