Top
logo

వివాదాస్పదం అవుతున్న మోడీ పర్యటన

వివాదాస్పదం అవుతున్న మోడీ పర్యటన
X
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం లేకపోవడం...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం లేకపోవడం వివాదాస్పదమవుతోంది. ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం హాజరుకావాల్సి ఉంటుంది. అయితే ఇవాళ మోడీ పర్యటనలో సీఎం కేసీఆర్‌‌ను దూరంగా పెట్టారు. ఇది కాస్త ఇప్పుడు వివాదం అవుతోంది. ప్రస్తుతం ఈ అంశాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. గత సంప్రదాయాలకు, ప్రొటోకాల్‌కు తిలోదకాలిచ్చేలా ప్రధాని వ్యవహరించిన తీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని రాష్ట్ర ప్రభుత్వం, ఆ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

టీఆర్ఎస్ నేతల విమర్శలపై బీజేపీ నేతలు రాజాసింగ్, ఎంపీ అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం గురించే ప్రధాని మోడీని పిలుస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ప్రధానిని పిలిచే అవసరం తమకు లేదన్న రాజాసింగ్.. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి మేమే చాలంటూ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే చైనా ప్రధాన మంత్రిని, పాకిస్తాన్ ప్రధాన మంత్రిని పిలుచుకోవాలని సవాల్ విసిరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని తరిమికొడతామని ఫైర్ అయ్యారు.

మరోవైపు టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వెళ్లి రిసీవ్ చేసుకోవాలన్నారు. మీ ఇంటికి ప్రధాని వచ్చినప్పుడు మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తారా అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‎‎కు ఈ మాత్రం ఇంగితజ్ఞానం లేకుండా ఫామ్ హౌజ్ లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

Web TitleNo KCR name in the list of VIPs to receive PM Modi in Hyderabad
Next Story