నిర్మల్ సేవాసమితి ఆధ్వర్యంలో మాస్క్ లు, మజ్జిగ పంపిణీ

S. Srikanth
Published on: 12 April 2020 9:41 PM IST
నిర్మల్ సేవాసమితి ఆధ్వర్యంలో మాస్క్ లు, మజ్జిగ పంపిణీ
X

నిర్మల్: పట్టణంలోని నిర్మల్ సేవా సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాయిడి రమేష్ ,శ్రీరాముల శ్రీనివాస్ , మాస్క్ ల తయారీదాత జి ఆర్ బి సెలెక్షన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం, రాత్రీ పగలు కష్టపడి ప్రజలకు సేవ చేస్తున్న పోలీసులు, డాక్టర్లు, నర్సులు, సహాయక సిబ్బంది కి 2000 మాస్కులను అందించారు. అదేవిధంగా మజ్జిగ దాత నిర్మల్ సేవా సమితి సభ్యులు విశాల్ సింగ్ ఠాగూర్ మంచిర్యాల చౌరస్తా, కొండాపూర్, గాంధీ చౌక్, బుధవార్ పేట్, బైల్ బజార్ , బస్ స్టాండ్ ఏరియా, తల్వేద ఎక్స్ రోడ్ వరకు అన్ని ప్రధాన వీధులలో పంపిణీ చేయడం జరిగింది.

ఈ పంపిణీ కార్యక్రమం ఈనెల 30 వరకు కొనసాగుతుందన్నారు. మానవసేవయే మాధవసేవగా ఏర్పడిన ఈ సంఘానికి దయార్థ హృదయం గలవారు, మీ వంతుగా సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ సేవా సమితి కోశాధికారి సాదం ఆనంద్, సభ్యులు తల కొక్కుల నరహరి తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story