32ఏళ్ల యువతిపై 19ఏళ్ల యువకుడు అత్యాచారం

X
Highlights
హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో నమ్మించి...
Arun Chilukuri4 Sep 2020 6:34 AM GMT
హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో నమ్మించి 32ఏళ్ల యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు 19 ఏళ్ల యువకుడు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువకుడు అదే ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువతిపై కన్నేశాడు. ఆమె వెంటపడి ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి నమ్మించాడు. పెళ్లి చేసుకొని హాయిగా జీవిద్దాం అంటూ ఏమార్చాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోమ్మని యువతి ఒత్తిడి తేవడంతో తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఇన్‌స్పెక్టర్ భాస్కర్ తెలిపాడు.
Web Titlenineteen years old Victimized 32 years old women in Hyderabad
Next Story