హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ పరిధిలో డ్రగ్స్‌ కలకలం

Arun Chilukuri
Published on: 20 Oct 2020 1:19 PM IST
హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ పరిధిలో డ్రగ్స్‌ కలకలం
X

హైదరాబాద్‌లో మరో డ్రగ్స్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టైంది. లంగర్‌హౌస్‌లో ఓ నైజీరియన్‌ వద్ద ఆరు గ్రాముల కోకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది. అదేవిధంగా నిందితుడు బెంగళూరు, గోవా నుంచి నగరానికి డ్రగ్స్‌ తెస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్టూడెంట్ వీసా మీద వచ్చిన డానియల్ అనే నైజీరియన్ ఇక్కడ చదువుతూనే డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లంగర్ హౌజ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story