కాపురానికి వెళ్ల‌న‌న్న న‌వ వ‌ధువు.. హ‌త్య చేసిన తండ్రి

New Bride Killed: మహబూబ్‌నగర్ జిల్లా జైనల్లీపూర్‌లో దారుణం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 31 May 2022 4:11 PM IST
Newly Married Girl was Killed by her Father in Mahabubnagar
X

కాపురానికి వెళ్ల‌న‌న్న న‌వ వ‌ధువు.. హ‌త్య చేసిన తండ్రి

New Bride Killed: మహబూబ్‌నగర్ జిల్లా జైనల్లీపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కూతురు కాపురానికి వెళ్లడంలేదని తండ్రి కూతురుతో పాటు భార్యను కూడా చంపేశాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. జైనల్లీపూర్ గ్రామానికి చెందిన కృష్ణయ్య తన కూతురు సరస్వతిని గత నెల 8న క్రిస్టియన్‌నపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిపించాడు. కానీ కూతురు కాపురానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది. నిన్న మధ్యాహ్నాం కూతురిని కాపురానికి పంపాలని భార్యకు సూచించాడు.

కానీ కూతురు కాపురానికి వెళ్లడానికి నిరాకరించడంతో కోపంతో భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. బయటకు వెళ్లి మద్యం తాగొచ్చిన కృష్ణయ్య నిద్రిస్తున్న భార్య, కూతురిపై కర్రతో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తాను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉందని మహబూబ్ నగర్ డీఎస్పీ మహేశ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు డీఎస్పీ.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story