Road Accident: సినీఫక్కిలో తండ్రి స్కెచ్.. కొడుకుని దాచి.. పోలీసులకు మరో వ్యక్తి..

Road Accident: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పీఎస్ పరిధి ఇనార్బిట్‌ మాల్‌ ముందు కారు ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూసింది.

Arun Chilukuri
Published on: 29 Jun 2021 7:23 PM IST
New Twist in Madhapur Road Accident
X

Road Accident: సినీఫక్కిలో తండ్రి స్కెచ్..

Road Accident: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పీఎస్ పరిధి ఇనార్బిట్‌ మాల్‌ ముందు కారు ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. సుజిత్ రెడ్డి, ఆశిష్ అనే వ్యక్తులు మద్యం మత్తులో ప్రమాదం చేశారని నిర్ధారించారు. అయితే సుజిత్ తండ్రి రఘునందన్ రెడ్డి మాత్రం మరో వ్యక్తి డ్రైవ్ చేశాడంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. సుజిత్ రెడ్డిని కేసు నుంచి తప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. నల్లకుంటలోని డీడీ కాలనీలో రహస్య ప్రాంతంలో దాచిపెట్టి పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. సీసీ టీవీలో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కారులో ఉన్నది సుజిత్, ఆశిష్ అని తేల్చారు. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించిన సుజిత్ తండ్రి రఘునందన్ రెడ్డిని కూడా నిందితుల్లో చేర్చారు. ప్రమాదానికి కారకులైన సుజిత్ రెడ్డి, ఆశిష్ తో పాటు రఘునందన్ రెడ్డిని రిమాండ్ కు తరలించారు పోలీసులు.

ప్రమాదానికి ముందు సుజిత్ రెడ్డి, ఆశిష్ లు స్నేహితుని ఇంట్లో విందుకు హాజరయ్యారు. కారు నడుపుతున్న సుజిత్ రెడ్డి మైహోం ఆబ్రా దగ్గర మితిమీరిన వేగంతో ఆటోనూ వెనుక నుంచి ఢీకొట్టాడు. ఆటో ఫల్టీలు కొడుతూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోగా ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా సుజిత్ రెడ్డి, ఆశిష్ ప్రమాదానికి కారకులుగా గుర్తించిన పోలీసులు మద్యం మత్తులో కారు నడిపినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story