Ration Card: సికింద్రాబాద్‌ బేగంపేట్‌లో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ

Ration Card: జురాస్టియన్‌ క్లబ్‌లో లబ్దిదారులకు కార్డులను అందజేసిన తలసాని

Sandeep Eggoju
Updated on: 26 July 2021 4:22 PM IST
New Ration Cards Distributed in Secundrabad Begumpet
X

హైద్రాబాద్ లోని బేగంపేట్ లో కొత్త రేషన్ కార్డుల జారీ (ఫోటో ది హన్స్ ఇండియా)

Ration Card: తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో మొత్తం కొత్తగా 3లక్షల 9వేల 83 కార్డులను జారీ చేసింది ప్రభుత్వం. లబ్దిదారులందరికీ కొత్త కార్డులను పంపిణీ చేస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. హైదరాబాద్‌ బేగంపేటలోని జురాస్టియన్‌ క్లబ్‌లో కొత్త రేషన్‌ కార్డులను లబ్దిదారులకు అందజేశారు మంత్రి తలసాని. ఆగస్టు నుంచే కొత్త కార్డు దారులందరికీ రేషన్‌ సరఫరా జరుగుతుందని స్పష్టం చేశారు. కుటుంబంలోని ఒక్కొక్కరికీ ఆరు కేజీల చొప్పున రేషన్‌ బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు తలసాని.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story