Neelima Kaushal: కౌశల్ భార్యకు యూకేలో చేదు అనుభవం

Neelima Kaushal: ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తు బిగ్ బాస్2 విజేత కౌశల్ భార్య నీలిమ తెలిపారు.

Kranthi
Published on: 4 Jun 2021 6:53 AM IST
Neelima Kaushal Covid Treatment Experience in Uk
X

Neelima Kaushal:(The Hans India)

Neelima Kaushal: 'బిగ్‌బాస్2' విజేత కౌశల్‌ మండా భార్య నీలిమకు యూకే(యునైటెడ్‌ కింగ్‌డమ్‌)లో చేదు అనుభవం ఎదురైందట..! ఈ విషయాన్ని ఆమె ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది. భారత్‌లో దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ, ఇక్కడే ఘోరంగా ఉంది. కరోనా సోకడంతో నాకు ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఛాతి నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది. నా పరిస్థితి బాగాలేదని వైద్యుల‌కు చెప్పాను.

కానీ, వాళ్లు కేవలం పారాసిటమాల్‌ మాత్రమే ఇచ్చారు. అంత‌కు మించి పెద్దగా పట్టించుకోలేదు.పైగా క‌రోనా ల‌క్షణాలు అలాగే ఉంటాయ‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు. యూకేలో చికిత్స గొప్పగా ఉంటుందనుకున్నాను. కానీ ఇక్కడి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని అర్థమైంది.నా జీవితంలో ఇది ఒక చేదు అనుభవం. మ‌న‌దేశంలో అయితే వెంట‌నే వైద్యం అందిస్తారు. ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తున్నారు. కాబట్టి మీరెవరూ భయపడొద్దు. మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. త్వరలోనే భారత్‌కు తిరిగొస్తాను'' అని నీలిమ ఆ వీడియోలో పేర్కొన్నారు

Kranthi

Kranthi

Next Story