Neelam Madhu: ఒకటి రెండు రోజుల్లో రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తా

Neelam Madhu: అందరి అభిప్రాయలతో భవిష్యత్తు కార్యాచరణ

Shekhar G
Updated on: 12 Feb 2024 7:15 PM IST
Neelam Madhu Mudiraj meeting with activists
X

Neelam Madhu: ఒకటి రెండు రోజుల్లో రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తా

Neelam Madhu: తనను నమ్మి తన వెంట నడుస్తున్న కార్యకర్తల అభీష్టం మేరకే భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని నిర్ణయం తీసుకుంటానని NMR యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో వచ్చే రాజకీయ పరిణామాలు, నిర్ణయాలపై కార్యకర్తల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను నమ్మి వెంట నడిచిన కార్యకర్తల ఋణం తీర్చుకోలేనిదని నీలం మధు అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులు, ఎదురైన ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లోకి వెళ్లి 50వేలకు దగ్గరగా ఓట్లను సంపాదించి ప్రజల హృదయాలను గెలుచుకోవడం కార్యకర్తల ద్వారానే సాధ్యపడిందని తేల్చి చెప్పారు. కార్యకర్తల భవిష్యత్తు కోసం రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తన ప్రాణ సమానమైన అందరి నిర్ణయమే తనకు శిరోధార్యమని, కార్యకర్తల సలహాలు, సూచనలకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని నీలం మధు ముదిరాజ్‌ వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఒకటిరెండు రోజుల్లో భవిష్యత్తు రాజకీయ నిర్ణయాన్ని వెల్లడిస్తానని ప్రకటించారు.

Shekhar G

Shekhar G

Next Story