ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి రోడ్డు భద్రత వారోత్సవాలు

S. Srikanth
Published on: 11 Jan 2020 2:20 PM IST
ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ స్థాయి రోడ్డు భద్రత వారోత్సవాలు
X

పఠాన్ చెరు: జాతీయ స్థాయి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా, వాహనచోదకులకు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని పారిశ్రామిక వాడ, ఇస్నాపూర్ క్రాస్ రోడ్ లో నిర్వహించిన పఠాన్ చెరు ట్రాఫిక్ పోలీస్ అధికారి వేణు కుమార్.

జాతీయ రహదారి పై, వాహనాలను నడిపే భారీ వాహనాల డ్రైవర్ లతో పాటు లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, బైక్ లు నడిపే వాహన చోదకులు రోడ్ పై పాటించాల్సిన నిభందనలపై అవగాహన కల్పించి, రోడ్ నిబంధనలు పాటించే విధంగా అందరితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమాన్ని ఎయిర్ వాటర్ కంపెనీ వారు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో కార్మికులు, సుమారు 100 మంది వాహన చోదకులు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story