Sunitha Laxma Reddy: న‌ర్సాపూర్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా సునీతా ల‌క్ష్మారెడ్డి.. బీ-ఫామ్ అంద‌జేసిన సీఎం కేసీఆర్

Sunitha Laxma Reddy: సునీత లక్ష్మారెడ్డికి బీఫామ్ ఇచ్చిన సీఎం కేసీఆర్

Shekhar G
Published on: 25 Oct 2023 4:31 PM IST
Narsapur Brs Candidate Is Sunitha Laxma Reddy
X

Sunitha Laxma Reddy: న‌ర్సాపూర్ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా సునీతా ల‌క్ష్మారెడ్డి.. బీ-ఫామ్ అంద‌జేసిన సీఎం కేసీఆర్

Sunitha Laxma Reddy: మెదక్ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే స్తానానికి BRS అభ్యర్థిని ఖరారు చేసింది. అంతర్గత సర్దుబాటు చేసిన పార్టీ కోర్ కమిటీ సభ్యులు.. టికెట్‌ను సునీత లక్ష్మారెడ్డి ఇవ్వాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. మెదక్ ఎంపీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సునీత లక్ష్మారెడ్డికి ప్రగతిభవన్‌లో బీఫామ్ అందజేశారు సీఎం కేసీఆర్. ఏకగ్రీవంగా బిఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల సిఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మదన్ రెడ్డి తనతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడన్న కేసీఆర్.. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుందని తెలిపారు. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు.

Shekhar G

Shekhar G

Next Story