తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌.. పీఎం మిత్ర మెగా టెక్స్‌‌టైల్స్‌ పార్క్‌ ప్రకటించిన ప్రధాని మోడీ

Narendra Modi Announced PM Mitra Mega Textiles Park
x

తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌.. పీఎం మిత్ర మెగా టెక్స్‌‌టైల్స్‌ పార్క్‌ ప్రకటించిన ప్రధాని మోడీ

Highlights

7 టెక్స్‌టైల్స్‌ పార్కుల్లో తెలంగాణకు దక్కిన చోటు

Narendra Modi: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా టెక్స్‌టైల్స్‌ పార్కుల్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు దక్కింది. ఇవాళ పీఎం మిత్ర పథకం కింద ఏడు మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌లను ప్రకటించారు ప్రధాని మోడీ. అందులో తెలంగాణకు కూడా చోటు దక్కింది. గతంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ప్రధాని మోడీ తెలంగాణకు టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఇస్తామని హామీ ఇవ్వగా.. ఇవాళ అధికారిక ప్రకటన వెలువడింది. టెక్స్‌టైల్‌ పార్క్ ప్రకటించడంతో తెలంగాణ ప్రజల తరపున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఈ టెక్స్‌టైల్‌ పార్క్ ద్వారా లక్షలాది మంది రైతులకు, చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories