Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు

Raja Singh: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.

Arun Chilukuri
Updated on: 23 Aug 2022 8:20 PM IST
Nampally Court Grants Bail to Raj Singh
X

Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు

Raja Singh: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 41సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్‌ చేశారని రాజాసింగ్‌ తరపు న్యాయవాదులు కోర్టులు వాదనలు వినిపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అరెస్ట్‌ చేయడం చట్టవిరుద్దమని తెలిపారు. అతని పాత కేసులు కూడా పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు చేసింది. కేసు దర్యాప్తులో పోలీసు అధికారులకు సహకరించాలని న్యాయమూర్తి ఆదేశించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story