Nagarjuna Sagar‌: తెలంగాణ భవన్ లో సంబరాలు.. అపశృతి

Nagarjuna Sagar‌: నాగార్జున సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం కావడంతో తెలంగాణ భవన్ లో ఆనందోత్సాహం నెలకొంది.

Arun Chilukuri
Published on: 2 May 2021 1:26 PM IST
Nagarjuna Sagar‌: Fire Accident in Telangana Bhavan
X

Nagarjuna Sagar‌: తెలంగాణ భవన్ సంబరాలు.. అపశృతి

Nagarjuna Sagar‌: నాగార్జున సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయం కావడంతో తెలంగాణ భవన్ లో ఆనందోత్సాహం నెలకొంది. మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి పార్టీ కార్యకర్తులు సంబురాలు చేసుకున్నారు. సాగర్ లో టీఆర్ఎస్ గెలుపు సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు.

ప్రతిపక్షాలను తప్పుడు మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. ఇకనైనా బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మంత్రులు హెచ్చరించారు. తెలంగాణ భవన్‌కు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని బాణసంచా కాల్చారు. బాణసంచా కాల్చుతున్న సమయంలో చలవ పందిరికి నిప్పురవ్వ అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన కార్యకర్తలు మంటలను ఆర్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story