Hyderabad: మైత్రి రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసం.. 50 కోట్లు సేకరించి బోర్డ్ తిప్పేసిన..

Mythri Real Estates Dupes People of Rs. 50 Crore in Hyderabad
x

Hyderabad: మైత్రి రియల్ ఎస్టేట్ సంస్థ భారీ మోసం.. 50 కోట్లు సేకరించి బోర్డ్ తిప్పేసిన..

Highlights

Hyderabad: మియాపూర్‌లో మైత్రి రియల్ ఎస్టేట్ సంస్థ సామాన్య, మధ్య తరగతి ప్రజల్ని నిండా ముంచేసింది.

Hyderabad: మియాపూర్‌లో మైత్రి రియల్ ఎస్టేట్ సంస్థ సామాన్య, మధ్య తరగతి ప్రజల్ని నిండా ముంచేసింది. తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ మోసం చేసింది. సుమారు 300 మంది నుంచి 50 కోట్ల రూపాయలు సేకరించి బాధితులను రోడ్డున పడేశారు. రామంతపూర్‌లో నివాసముంటున్న గుంటూర్‌కు చెందిన జానీబాషా... మియాపూర్‌లోని అల్విన్ చౌరస్తాలో మైత్రి ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించాడు.

కాగా హైదరాబాద్‌ గాగిలాపూర్‌లో రాయల్ లీఫ్, రామేశ్వర్ బండలో రాయల్ ప్యారడైజ్, మామిడిపల్లిలో రాయల్ మింట్, హాంప్టన్ పామ్స్‌‌లో ఓపెన్ ప్లాట్లు అమ్ముతానని దొంగ డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు చూయించి డబ్బులు కట్టించుకున్నాడు. ఒక్కొక్కరి నుంచి 25 లక్షల మేర తీసుకున్నాడు. పెట్టుబడి పెట్టిన వారు ప్లాట్లు అడిగితే ఏదో సాకు చూపి మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. చివరకు మకాం మార్చి పారిపోయాడు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం చేయాలని కోరుతూ మియాపూర్‌లోని సంస్థ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. పొలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories