Murder in Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. చిన్నారి గొంతుకోసి పరారీ
Murder in Hyderabad: హైదరాబాద్ లో దారుణం జరిగింది. అభం శుభం ఎరగని చిన్నారి గొంతు కోసి నిందితుడు పరారైయ్యాడు.
Murder in Hyderabad: హైదరాబాద్ లో దారుణం జరిగింది. అభం శుభం ఎరగని చిన్నారి గొంతు కోసి నిందితుడు పరారైయ్యాడు. ఘట్కేసర్ లోని పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఈ ఘటన జరిగింది. ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్ లో నివాసం ఉంటున్న కళ్యాణ్ -అనూష దంపతులు ఆరేళ్ల కూతురు అధ్యను గొంతు కోసి నిందితుడు కరుణాకర్ పరారైయ్యాడు.
గత కొంతకాలంగా అనూషతో కరుణాకర్ చనువుగా వుంటున్నాడు. ఆమె దూరం పెట్టడంతో కసి పెంచుకున్న కరుణాకర్ ఈ దారుణానికి ఒడిగట్టాడని సమాచారం. ఈరోజు ఉదయం ఇంట్లో ఉన్న అనూష కూతురు అధ్య గొంతు కోసి పరారైయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాలిక మృత దేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కరుణాకర్ కోసం గాలిస్తున్నారు.
Next Story




