Narayanpet: వార్డులో అక్రమ కట్టడాలకు నోటిసులు జారీ

యజమానులకి మున్సిపాలిటీ సమర్పించిన ప్లాన్ కు అనుగుణంగా నిర్మాణం చేయుట, మున్సిపాలిటీ పర్మిషన్, సెట్ బ్యాక్ తదితర అంశాలను పరిశీలించారు.

S. Srikanth
Published on: 4 March 2020 1:50 PM IST
Narayanpet: వార్డులో అక్రమ కట్టడాలకు నోటిసులు జారీ
X

నారాయణపేట: జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఆదేశాల మేరకు నారాయణపేట పట్టణంలోని 7వ వార్డ్ పరిధిలోని గాయత్రీ నగర్, అశోక్ నగర్ లలో ఇండ్ల నిర్మాణం చేపట్టిన యజమానులకు నోడల్ అధికారి జైపాల్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ సలీం, మున్సిపల్ ప్రత్యేక అధికారిణి వనితలు నోటీసులు జారీ చేశారు. వార్డులో నిర్మాణం చేపట్టిన ఇండ్ల దగ్గరకి వెళ్ళి ఇంటి నిర్మాణాలను పరిశీలించారు.

యజమానులకి మున్సిపాలిటీ సమర్పించిన ప్లాన్ కు అనుగుణంగా నిర్మాణం చేయుట, మున్సిపాలిటీ పర్మిషన్, సెట్ బ్యాక్ తదితర అంశాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా వార్డులో నిర్మాణం చేపట్టిన 8 మంది ఇండ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు మైనోద్దీన్, షబ్బీర్ అలీ, గట్టు. రాఘవరెడ్డి, వినోద్, నయుమ్, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story