Telangana: మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారం మొదలుపెట్టిన మంత్రి గంగుల కమలాకర్

కార్పొరేషన్ లో టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఘనంగా పూరించింది.

S. Srikanth
Published on: 12 Jan 2020 2:41 PM IST
Telangana: మున్సిపల్ ఎలక్షన్ల ప్రచారం మొదలుపెట్టిన మంత్రి గంగుల కమలాకర్
X

కరీంనగర్ టౌన్: కార్పొరేషన్ లో టీఆర్ఎస్ తన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఘనంగా పూరించింది. నగరంలోని యజ్ఞవరాహ స్వామి దేవస్థానంలో మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు చేసి డోర్ టూ డోర్ క్యాంపెయిన్ ప్రారంభించారు. 6వ డివిజన్ కాపువాడ, 41వ డివిజన్ వావిలాలపల్లిలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రచారానికి వచ్చిన మంత్రి గంగుల కమలాకర్ కు మహిళలు తిలకం దిద్ది, మంగళహారతులతో స్వాగతం పలికారు.

కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలకు చెందిన ఏ ఒక్క అభ్యర్థి కార్పొరేటర్ గా గెలిచినా, నగరంలో జరుగుతున్న అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, సుడా ఛైర్మన్ జి.వి.రామకృష్ణ రావు, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, సత్యనారాయణ గౌడ్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story