Manda Krishna Madiga: మాదిగలకు రేవంత్ ప్రభుత్వం ద్రోహం చేసింది

Manda Krishna Madiga: కాంగ్రెస్ సర్కార్ పై MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైరయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 8 Oct 2024 9:31 PM IST
Mrps Chief Manda Krishna Madiga Fire On Congress Govt In Telangana
X

Manda Krishna Madiga: మాదిగలకు రేవంత్ ప్రభుత్వం ద్రోహం చేసింది

Manda Krishna Madiga: కాంగ్రెస్ సర్కార్ పై MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఫైరయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి రేవంత్ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని ఆయన మండిపడ్డారు. మాదిగల పట్ల ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతూ..మరో సామాజిక వర్గానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు వచ్చి రెండు నెలలు దాటినా..ఇప్పటి వరకూ తెలంగాణలో అమలు చేయలేదని దుయ్యబట్టారు మందకృష్ణ.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ లేకుండానే ఉద్యోగ నియామ‌కాలు చేప‌డుతున్నారు. అసెంబ్లీలో ప్ర‌క‌టించిన మాదిరిగా.. రేవంత్ రెడ్డి అన్ని ప్ర‌భుత్వ ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌లో ఎస్సీ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని మంద‌కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వ‌ర్గీక‌ర‌ణ చేయ‌కుండానే 11 వేల టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. దీనికి వ్య‌తిరేకంగా జిల్లా కేంద్రాల్లో రేపు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వ‌హించి, ధ‌ర్నా చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

జిల్లా కేంద్రాల్లోని అంబేద్క‌ర్ విగ్ర‌హాల నుంచి క‌లెక్ట‌ర్లేట్ల వ‌ర‌కు ర్యాలీలు చేప‌ట్టాల‌న్నారు. అనంత‌రం జిల్లాల్లో క‌లెక్ట‌ర్ల‌కు విన‌తిప‌త్రాలు అందించాలి. హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్యాంక్ బండ్ నుంచి బ‌షీర్‌బాగ్ వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంద‌కృష్ణ మాదిగ తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story