MP Arvind: రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది

MP Arvind: సీఎం రేవంత్ రెడ్డి రక్తమంతా హిందుత్వం ఉంది.. కానీ హిందువులకు మేలు చేయలేని స్థితిలో ఉన్నారు

Jyothi
Published on: 20 April 2024 7:54 PM IST
MP Arvind Comments On BRS And Congress
X

MP Arvind: రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయింది

MP Arvind: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్... మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిధులు కాజేశారని ఆరోపించారు... సీఎం రేవంత్ రెడ్డి రక్తమంతా హిందుత్వం ఉందని, కానీ హిందువులకు మేలు చేయలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటయిందని, కేవలం కార్యాలయం, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడమే ఆలస్యమని, మరికొద్ది రోజుల్లో పసుపు బోర్డు ఆఫీసు ప్రారంభమవుతుందన్నారాయన... నిజామాబాద్ జిల్లాలో విద్యకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు అర్వింద్.. జాతీయ రహదారులు, రైల్వే లైన్ల విస్తరణ, నిర్మాణ పనులు ప్రారంభించిన ఘనత కేవలం మోడీకే దక్కుతుందన్నారు.

Jyothi

Jyothi

Next Story