Karimnagar: విషాదం.. కుటుంబ కలహాలతో చిన్నారితో కలిసి తల్లి సూసైడ్

Karimnagar: ఏడాది బాబుకు విషమిచ్చి, సూసైడ్ చేసుకున్న శ్రీజ

Jyothi
Published on: 2 April 2024 3:02 PM IST
Mother Committed Suicide with Child due to Family Quarrel in Karimnagar
X

Karimnagar: విషాదం.. కుటుంబ కలహాలతో చిన్నారితో కలిసి తల్లి సూసైడ్

Karimnagar: కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌లో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఏడాది కుమారుడికి విషమిచ్చిన తల్లి.. అనంతరం తాను కూడా సూసైడ్ చేసుకుంది. వరంగల్‌కు చెందిన నరేష్‌తో శ్రీజకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. అయితే భర్తతో గొడవల కారణంగా శ్రీజ కరీంనగర్ విజయపురి కాలనీలోని తన తల్లి ఇంట్లో ఉంటుంది. భర్తతో గొడవల కారణంగా మనస్తాపం చెందిన ఆమె ఏడాది బాబుకు విషమిచ్చి.. తానూ తాగి సూసైడ్ చేసుకుంది.

శ్రీజను గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక కూతురు మృతితో మనస్థాపం చెందిన తల్లి జయప్రద కూడా విషగులికలు తిని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ప్రస్తుతం ఆమెకు ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story