MLC Naveen Kumar: ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు

నా గెస్ట్‌హౌస్‌తో పాటు నా నివాసంలో పోలీసు తనిఖీలు జరగలేదు -నవీన్‌కుమార్

Arun Chilukuri
Published on: 8 April 2024 3:42 PM IST
MLC Naveen Kumar Responds On Phone Taping Issue
X

MLC Naveen Kumar: ఫోన్‌ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు

MLC Naveen Kumar: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన గురించి కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టి పారేశారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌. ఫోన్‌ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. తన గెస్ట్‌హౌస్‌తో పాటు తన నివాసంలో ఎలాంటి పోలీసు తనిఖీలు జరగలేదని, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రచారం చేస్తున్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని, పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story