MLC Kavitha: బీఆర్‌ఎస్‌ అంటే ప్రజల ఇంటి పార్టీ.. రాహుల్ యాత్ర కూడా అలానే ఉంది..

MLC Kavitha: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ర్యాలీలో నిర్వహించింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్‌ పాల్గొన్నారు.

Arun Chilukuri
Published on: 16 Aug 2023 5:17 PM IST
MLC Kavitha Slams Congress Party
X

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ అంటే ప్రజల ఇంటి పార్టీ.. రాహుల్ యాత్ర కూడా అలానే ఉంది..

MLC Kavitha: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ర్యాలీలో నిర్వహించింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్‌ పాల్గొన్నారు. బోధన్‌లో నిర్వహించిన ర్యాలీ..పాదయాత్రలా కాదు.. విజయోత్సవ ర్యాలీల ఉందని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులం, మతాల పేరుతో చూడకుండా సమానంగా అభివృద్ధి చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే ప్రజల ఇంటి పార్టీ అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజలంటే ఇతర పార్టీలకు ఈవీఎం లాగా కనపడతారని ఆమె విమర్శించారు. 35 లక్షల మంది రైతులకు బీఆర్ఎస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు.

కాంగ్రెస్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్‌ అయ్యారు. కాంగ్రెస్‌ నుండి మంత్రిగా పనిచేసిన సుదర్శన్‌రెడ్డి ఒక్క చెరువును కూడా బాగుచేయలేదని ఆమె ప్రశ్నించారు. బోధన్‌లో సీనియారిటీకి, సిన్సియారిటీకి మధ్యే పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఇచ్చే హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు. 62 ఏళ్లలో కాంగ్రెస్‌ ఏం చేసిందని రాహుల్‌ పాదయాత్ర చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్లు ... రాహుల్ యాత్ర కూడా అలానే ఉందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story