MLA Vivekanand Goud: కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే వివేకానంద

MLA Vivekanand Goud: తనను భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయబోను

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 15 July 2024 5:30 PM IST
MLA Vivekananda has condemned the ongoing campaign that he is going to join the Congress
X

MLA Vivekanand Goud: కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే వివేకానంద

MLA Vivekanand Goud: బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు ఎమ్మెల్యే కేపి వివేకానంద. తాను పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్ల నమ్మకాన్ని వమ్ము చేయబోనని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పదవి పోవడం ఖాయమని.. ఆ స్థానాల్లో ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అనుభవ రాహిత్యంగా ఉన్నాయని, రీజినల్ రింగ్ రోడ్డు పేరుతో భారీ భూ ఆక్రమణలు చేయాలని చూస్తున్నారని కేపి వివేకానంద ఆరోపించారు. తమ పార్టీ నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు చూపెట్టిన శ్రద్ధ, నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి చూపడం లేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story