Rajaiah: ప్రగతిభవన్‌కు ఎమ్మెల్యే రాజయ్య.. కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో భేటీ

Rajaiah: నియోజకవర్గంలో పరిస్థితులపై చర్చించనున్న రాజయ్య

Shekhar G
Published on: 26 July 2023 2:12 PM IST
MLA Rajaiah Going To Meet kCR
X

Rajaiah: ప్రగతిభవన్‌కు ఎమ్మెల్యే రాజయ్య.. కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో భేటీ

Rajaiah: స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య ప్రగతిభవన్‌ చేరుకున్నారు. కాసేపట్లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులపై రాజయ్య సీఎంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా కడియం, రాజయ్య మధ్య మాటలయుద్ధం కొనసాగుతుండగా.. కడియంకు ప్రాధాన్యత పెంచడం పట్ల రాజయ్య అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న సీఐల బదిలీల్లోనూ రాజయ్య సిఫారసు పట్టించుకోకపోవడంతో ఆయన సీఎంతో భేటీ అవుతున్నారు. తన అసంతృప్తిని సీఎంకు చెబుతానంటూ అనుచరులతో రాజయ్య చెప్పినట్లు సమాచారం. ఇక ఈ భేటీ తర్వాత రాజయ్య తన భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story